![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-588 లో.. ధాన్యలక్ష్మి ఆస్తిని వాటాలు చేయమనడంతో సుభాష్ పంచేద్దామని అంటాడు. ఇక ఇందిరాదేవి అందరిని తిట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి కోసం కావ్య ప్లేట్ లో అన్నం తీసుకెళ్తుండగా.. అపర్ణ చూసి అత్తయ్య కోసమా అని అడుగుతుంది. అవునని చెప్తూ తన గదికి ఇద్దరు వెళ్ళగా అక్కడ ఇందిరాదేవి ఉండదు. ఇక ఇల్లంతా చూస్తారు. ఇక అపర్ణ కంగారుపడుతుంటే.. అమ్మమ్మ గారు ఎక్కడికెళ్ళారో నాకు తెలుసంటు హాస్పిటల్ కి వెళ్తుంది కావ్య.
కోమాలో ఉన్న సీతారామయ్య ముందు ఇందిరాదేవీ కన్నీళ్లు పెట్టుకుంటు.. చూశావా బావా ఏం జరుగుతుందో.. మహా వృక్షం లాంటి నువ్వు మంచాన్న పడ్డాక.. అందరి నోళ్లు లెగుస్తున్నాయంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక అది గమనించి కళ్యాణ్.. లోపలికి వచ్చి ఇందిరాదేవిని పలకరించి ఓదార్చే పనిలో పడతాడు. ఇంతలో అపర్ణాదేవికి క్యారేజ్ పట్టుకుని వస్తుంది కావ్య. బతిమలాడి, బుజ్జిగించి చాలా సేపు సర్దిచెబుతుంది కావ్య. ఇక తను వినకపోవడంతో.. కవిగారు తాతయ్యగారి బెడ్ పక్కనే మరో బెడ్ ఏర్పాటు చేయండని కావ్య కోపంగా అంటుంది. అదేంటి వదినా అని కళ్యాణ్ అనగా.. అమ్మమ్మగారు చూడండి తాతయ్యగారు పక్కనే మరో బెడ్ వేయించి అక్కడ నేను పడుకుంటాను.. ఇక చూడండి మీరు రెండు రెండు సార్లు ఏడవాల్సి ఉంటుందంటూ ఇందిరాదేవిని నవ్వించే ప్రయత్నం చేసి.. తర్వాత తినిపించి.. ఇందిరా దేవిని ఇంటికి పదమంటుంది. ఇందిరాదేవి ఆసుపత్రి నుంచి బయలుదేర్తుంది. ఇక ఆ తర్వాత కవి, కళావతి మంచి చెడు మాట్లాడుకోవడం హైలైట్‌గా నిలిచింది. కవిగారు.. తాతయ్యగారు పరిస్థితి గురించి డాక్టర్స్‌తో మాట్లాడారా అని కావ్య అడుగగా.. మాట్లాడాను వదిన అంటాడు కళ్యాణ్.
అడిగాను వదినా.. ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారు. తాతయ్యగారు కోమాలోంచి బయటికి వచ్చాకే ట్రీట్‌మెంట్ చేస్తారట.. అంత వరకూ అలా ఉండాల్సిందేనంటున్నారని కళ్యాణ్ అంటాడు. చాలా బాధగా ఉంది కవిగారు.. నిస్సహాయస్థితిలో అమ్మమ్మగారిని చూడలేపోతున్నానని కావ్య అంటుంది కావ్య. మాటల మధ్యలోనే అప్పూకి పోలీస్ జాబ్ వచ్చిందని, ట్రైనింగ్‌కి పంపించానని, తాతయ్యగారి ఆరోగ్య పరిస్థితి గురించి చెబితే ఆగిపోతుందని చెప్పలేదంటూ నిజం చెబుతాడు కళ్యాణ్. మంచి పని చేశారు కవిగారని కావ్య అంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మి, ప్రకాష్ మాట్లాడుకుంటారు. మన కళ్యాణ్ కోసం డాక్యుమెంట్స్ సిద్ధం చేయించాను.. మావయ్యగారి పరిస్థితి చూస్తే రేపో మాపో అన్నట్లు ఉంది కదా.. ముందు జాగ్రత్తగా అత్తయ్యతో మాట్లాడతానని ధాన్యలక్ష్మి అనగానే.. తనని ప్రకాష్ తిడతాడు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ లాక్కుని చింపి పడేస్తాడు. ఆ తర్వాత కావ్య వంటగదిలో నేలమీద పడుకుంటుంది. అప్పుడే అపర్ణ చూస్తుంది. రాజ్ ని పిలిచి అపర్ణ ఫైర్ అవుతుంది. ఎందుకు ఉంది అంటే పంపించేద్దాం అంటావా.. తెలివిగా మాట్లాడుతున్నావా రాజ్.. ఈ ఇంటికి నీ భార్య తిరిగి వచ్చింది ఆ విషయం తెలుసా నీకు అని అపర్ణ అనగా.. కళ్లెదురుగా కనిపిస్తూ ఉంది కదా రాజ్ అంటాడు. కనిపిస్తే ఇంత రాత్రి అయిన నీ గదికి రాకపోతే ఎక్కడికి వెళ్లింది ఎందుకు వెళ్లిందని అడగాల్సిన అవసరం లేదా అని అపర్ణ అడుగగా.. ఎవరిని అడగాలి.. ఆమెను నేను రమ్మనలేదు. వస్తే పొమ్మనలేదని రాజ్ అంటాడు. కావ్య నేల మీద పడుకుంది తెలుసా అని కిందకు చూపిస్తుంది. ఇక్కడ పడుకుందా? అని రాజ్ షాక్ అయ్యి ఆవేశంగా కావ్యవైపు చూస్తూ.. హేయ్ అంత మానవత్వం లేని మనుషులు ఏమైనా ఉన్నారనుకున్నావా.. ఈ ఇంట్లో.. అరే వంటింట్లో నేల మీద పడుకోమని ఎవరు చెప్పారు నీకు అని రాజ్ కోపంగా అంటాడు. మరి ఎక్కడుండాలని అపర్ణ అంటుంది. ఎక్కడ అంటే మరి అది.. హా.. అది అంటూ రాజ్ నసుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |